APPSC: ఎపి డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష షెడ్యూల్ విడుద‌ల

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిపార్ట్‌మెంట‌ల్ పరీక్ష‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎపిపిఎస్‌సి) తేదీల‌ను ఖ‌రారు చేసింది. జూన్ 20వ తేదీ నుండి 25వ తేదీ వ‌ర‌కు జిల్లా కేంద్రాల్లో డిపార్ట్‌మెంట‌ల్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎపిపిఎస్‌సి ప్ర‌క‌టించింది. ప‌రీక్ష‌ల‌కు 55,036 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఎపిపిఎస్‌సి పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.