రామ్ చరణ్‌ను చూసి అసూయపడ్డా.. పవన్‌కల్యాణ్
రాజమహేంద్రవరం (CLiC2NEWS): ‘గేమ్ ఛేంజర్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఎపి డిప్యూటి సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ గురించి పవన్ మాట్లాడారు. చరణ్ ఏడేళ్ల వయసు నుండే హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడని పవన్ కల్యాణ్ తెలిపారు. తెల్లవారుజామునే లేచి హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడన్నారు. చరణ్ పుట్టినపుడు తాను ఇంటర్ చదువుతున్నానని, అన్నయ్య చిరంజీవి తనకు తండ్రిలాంటి వారని, రామ్ నాకు తమ్ముడిలాంటి వాడు అన్నారు. రామ్ బంగారమని.. ఓ తల్లికి పుట్టకపోయినా తను నాతమ్ముడు అని పవన్ అన్నారు.
మగధీర లో చరణ్ గుర్రపు స్వారీ చూసినపుడు తనకు అసూయ కలిగిందని.. తానూ నేర్చుకుని ఉంటే బాగుండేదనిపించిందన్నారు. చరణ్‌కు అద్భుత విజయాలు కలగాలని ఆశీర్వదించారు. రంగస్థలంలో తన నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందనుకన్నానని, భవిష్యత్‌లో తప్పకుండా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.