తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
తిరుపతి (CLiC2NEWS): తిరుపతి ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని, అనిత , ఆనం రామానారాయణ రెడ్డి, పార్ధ సారథి పరామర్శించారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి అన్నారు.
తిరపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. గాయపడిన వారిని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిఎం చంద్రబాబు బాధితులను పరామర్శిస్తారిని తెలిపారు.