ఆగ‌స్టు 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ‌స‌భ‌లు.. డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాష్ట్ర స‌చివాలయం నుండి అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఉపాధిహామీ ప‌థ‌కంలో చేప‌ట్ట‌వ‌లిసిన ప‌నుల ఆమోదం కోసం గ్రామ స‌భ నిర్వ‌హ‌ణ‌, అందుకు సంబంధించిన విధి విధాల‌ను పై ద‌శానిర్దేశం చేశారు. ఆగ‌స్టు 13న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీ ల్లో గ్రామ స‌భ‌ల నిర్వ‌హ‌ణ చేప‌ట్టాల‌న్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం ప‌రిధిలో 46 ర‌కాల ప‌నులు చేప‌ట్ట‌వ‌చ్చ‌ని .. ఈ ప‌థ‌కం ద్వా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు. ప్ర‌తి రూపాయిని బాధ్య‌త‌తో ఖ‌ర్చు చేయాల‌న్నా ఆయ‌న.. ఉపాధి హామీ ప‌థ‌కం ల‌క్ష్యం అందుకోవాలన్నారు. ఈ ప‌థ‌కం అమ‌లులో బాధ్య‌త తీసుకోవాల‌ని, సోష‌ల్ ఆడిట్ విభాగం ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రించాలని డిప్యూటి సిఎం సూచించారు.

Leave A Reply

Your email address will not be published.