AP: మరో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న హెచ్‌సిఎల్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సిఎస్ సంస్థ మరో 10 వేల మందికి ఉద్యోగా అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎపిలో తమ కార్యకలాపాలు ప్రారంభించి 4,500 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్ శివప్రసాద్‌లు ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. సంస్థ విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్-2 లొ భాగంగా నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించినట్లు సమాచారం.