AP: మ‌ధ్యాహ్న భోజ‌నం తిన్న 40 మంది విద్యార్థులకు అస్వ‌స్థ‌త‌

అనంత‌పురం (CLiC2NEWS): జిల్లాలోని క‌క్క‌ల‌ప‌ల్లిలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం తిని 40 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. పాఠ‌శాల‌లో విద్యార్థులు ఆహారం తిన్న త‌రువాత క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో గ‌మ‌నించిన ఉపాధ్యాయులు త‌ల్పిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. వారు వ‌చ్చిన త‌ర్వాత అంబులెన్సుల్లో విద్యార్థుల‌ను అనంత‌పురం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆస్ప‌త్రి సూప‌రింటెండ్ వెల్ల‌డించారు. రేప‌టి వ‌ర‌కు విద్యార్థుల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచుతామ‌ని తెలిపారు.

toto togel

Leave A Reply

Your email address will not be published.