AP: భూముల మార్కెట్ ధరలను పెంచడంలేదు

అమరావతి(CLiC2NEWS): ఏపీ ప్రభుత్వం భూముల మార్కెట్ ధరలను పెంచకూడదని నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలు పెంచే ప్రభుత్వం, ఈ సంవత్సరం కరోనా కారణంగా ధరలను పెంచడంలేదని తెలిపింది. ప్రజల విజ్ఙప్తుల మేరకు ఈసారి భూముల ధరల మార్పు చేయడంలేదని పేర్కొంది