కేరళలో ఎపి మంత్రి అరెస్ట్..

అమరావతి (CLiC2NEWS): ఎపి మాజి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో ఎపి పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసు స్టేషన్‌లో గోవర్ధన్‌రెడ్డిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. కేరళలో ఆయనను ఆదివారం ఎపి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. రేపు ఉదయం నెల్లూరు తీసుకొచ్చేఅవకాశం ఉన్నట్లు సమాచారం.