AP: రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పెరిగిన రద్దీ
ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ కొత్తఛార్జీలు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో వచ్చేనెల మొదటి తేదీ నుండి రిజిస్ట్రేషన్ సవరణ విలువలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. పలు ప్రాంతాల్లో రాత్రిపూట కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి సవరించిన విలువలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ప్రధాన కారయదర్శి ఆర్‌పి సిసోడియా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలు సవరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ట రిజిస్ట్రేషన్ విలువల పెంపు, తగ్గింపు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1న రిజిస్ట్రేషన్ విలువలు , స్ట్రక్చర్ విలువలను సవరించాల్సి ఉంది.