ఉద్యోగుల ఖాతాల నుండి రూ. 800 కోట్లు మాయం.. ఏమైనట్లు?
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల వ్యక్తిగత జిపిఎఫ్ ఖాతాల నుండి రూ. 800 కోట్లు మాయమయ్యాయి. ఎపి ప్రభుత్వం డిఎ బకాయినలు జిపిఎఫ్ ఖాతాలకు జమ చేసి నట్టే చేసి, వెనక్కి తీసుకుందని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. డిఎ బకాయిలను విడతల వారీగా జమచేసినట్లు స్లిప్పుల్లో ఉండగా.. గత మార్చి నెలలో మొత్తం ఎకేసారి వెనక్కి తీసేసుకున్నట్లు ఉంది. ఉద్యోగుల సర్వీసును అనుసరించి ఒక్కొక్కరి ఖాతాలో సుమారు రూ. 60వేల నుండి రూ. 1.50 లక్షల వరకు జమ అయినట్లే అయ్యి, వెనక్కి వెళ్లిపోయాయి. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్ధిక శాఖ అధికారులను కలిసినా స్పష్టత రాకపోవడం పలు సందేహాలకు దారితీస్తుంది.
ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాల నుండి నగదు ఎలా విత్‌డ్రా జరిగిందనేది తమకు కూడా తెలియదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్ధిక శాఖ అధికారులు తెలిపినట్టు సమాచారం. జిపిఎఫ్ ఖాతాల్లో నగదు వేయడం, తీయడంపై సిఎఫ్ ఎంఎస్‌లో సాంతేతిక లోపం కూడా కారణం కావచ్చని ఆర్థిక శాఖ అధికారలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల ఖాతాల నుండి ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదని ఆర్ధిక శాఖ అధికారులు తెలపినట్లు ఎపి ఎన్జిఓ నేత బండి శ్రీనివాసరావు వెల్లడించారు.