గన్నవరం సమీపంలో కేసరిపల్లి వద్ద ‘హైందవ శంఖారావం’
గన్నవరం (CLiC2NEWS): గత ఐదేళ్లలో హైందవ ధర్మంపై విపరీతంగా దాడి జరిగిందని ఎంపి పురందేశ్వరి ఆరోపించారు. ఎన్‌టిఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరిపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో హైందవ శంఖారవం సభను నిర్వహించారు. ఈ సభకు హాజరైన పురందేశ్వరి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరు వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. అది ప్రతి ఒక్కరికీ వివరించాలనే ఉద్దేశంతోనే సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి, హిందూధర్మ పరిరక్షణ సాధించాలంటే హిందువులందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తేనే సాధ్యమవుతుందన్నారు.
హైందవ శంఖారవం సభకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ధర్మాన్ని నలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజి అన్నారు. ఎన్నో మహిమలు కలిగిన దేవాలయాలను స్వతహాగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
సినీ గుయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఆలయాలకు ఆత్మగౌరవం కోసం భారీగా హిందువులు తరలి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మా హననానికి , హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. వాల్మికి రామాయణం, వ్యాస భారతం.. భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్లలాంటివన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని కోరారు.