ఒప్పంద అధ్యాపకుల వేతనాలు పెంపు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/06/money.jpg)
అమరావతి (CLiC2NEWS): విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల గౌరవ వేతనాలను పెంచేందుకు అనుతిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యుజిసి, ఎఐసిటిఈ ప్రకారం అర్హతలు ఉన్న వారికి నెలకు రూ. 35వేలు, పిహెచ్‌డి ఉంటే అది పూర్తి చేసినప్పటి నుండి నెలకు రూ. 5వేలు అదనంగా ఇస్తారు. నెట్, స్లెట్ లేకుండి పిజి, పిహెచ్‌డి ఉంటే మాత్రం రూ. 5వేలే ఇవ్వరు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఏడాదికి రూ.వెయ్యి చొప్పన ఇంక్రిమెంట్ ఇస్తారు. దీన్ని ప్రాథమిక వేతనం రూ. 35 వేలకు మాత్రమే కలుపుతారు. ఉద్యోగి పని తీరును సమీక్షించిన తర్వాతే ఇంక్రిమెంట్ ఇవ్వనున్నారు.