బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం

అమరావతి (CLiC2NEWS): ఎపిలో బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్.. జనసేన పార్టి కేంద్ర కార్యాలయంలో పార్టి ఎమ్మెల్యేలకు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ అధ్యక్షతన పార్టి శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టి సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు. శాసన సభ సాంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజలు సమస్యలు, ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమం గురించి చట్ట సభల్లో ప్రతి సభ్యుడు వినిపించాలన్నారు. సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్గొనాలని పవన్ సూచించారు. ముందుగా పౌర సరవఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభోపన్యాసం చేశారు. సమావేశానంతరం సభ్యులందరికీ పవన్‌కల్యాణ్ విందు ఏర్పాటు చేశారు.