AP: పోలీసు కానిస్టేబుళ్ల ఫ‌లితాలు విడుద‌ల‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పోలీసు కొలువ అప్‌డేట్ వ‌చ్చింది. శుక్ర‌వారం ఎపి పోలీసు కానిస్టేబుళ్ల తుదిఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. హోంమంత్రి అనిత ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. మంగ‌ళ గిరిలోని డిజిపి కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో డిజిపి హ‌రీష్ కుమార్ గుప్తా, ఏపీ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మ‌న్ ఆర్‌.కె.మీనా త‌దిత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

ఫ‌లితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://slprb.ap.gov.in/

 

కాగా ఈ ఫ‌లితాల్లో 168 మార్కుల‌తో ఫ‌స్ట్ ర్యాంకులో గండి నానాజి,
159 మార్కుల‌తో రెండో ర్యాంకులో జి. ర‌మ్య మాధురి,
144.5 మార్కుల‌తో మూడో స్థానంలో మెరుగు అచ్చుత రావు నిలిచారు.

2023లో 6100 కానిస్టేబుళ్ల బ‌ర్తీకి ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష నిర్వ‌హించారు. దాంట్లో మొత్తం 5,09,579 మంది కానిస్టేబుల్ అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు ఎన్నిక‌య్యారు. వీరిలో 4,58,219 మంది ప‌రీక్ష‌కు హాజ‌రయ్యారు. 2022లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ నోటిఫికేష‌న్ విడుద‌లయింది.

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:India vs US trade war: ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌వు..

 

 

Leave A Reply

Your email address will not be published.