AP: క్వారీలో ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
బాపట్ల (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే కార్మీకులు ప్రాణాలను కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఇప్పటి వరకు నలుగురు కార్మికులను బయటకు తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో 16 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.. బల్లికుర అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని అధికారులు ప్రాథమింగా గుర్తించారు.
ఘటనపై స్పందించిన ఎపి సిఎం చంద్రబాబు
బాపట్ల జిల్లాలో క్వారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తప్పక చదవండి:UP: బొలేరో బోల్తాపడి 11 మంది మృతి