AP: ఏలూరు నగర మేయర్‌గా షేక్ నూర్జహాన్

ఏలూరు టౌన్ (CLiC2NEWS): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ మేయర్‌గా షేక్ నూర్జహాన్ ఎన్నికయ్యారు. నూర్జహాన్ రెండవ సారి మేయర్ పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆమె 2014లో మొదటి సారి మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటి మేయర్‌గా గుడి దేసి శ్రీనివాసరావు, నూకపెయ్యి సధీరుబాబు ఎన్నికయ్యారు. మొత్తం 50 డివిజన్‌లకు 47 డివిజన్‌లు వైకాపా దక్కించుకోవడంతో తెదేపా కేవలం 3 స్థానాలకే పరిమితం అయ్యింది.