రేపు ఎపి టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలను సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేశారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలుసుకోవచ్చు. శనివారం విడుదల చేయవలసిన ఫలితాలు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసినదే.