AP: ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు

నెల్లూరు (CLiC2NEWS): నెల్లూరులోని భగత్‌సింగ్‌ నగర్‌లో టిడ్కో ఇళ్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్ లు‌ ప్రారంభించారు. ఈరోజు (శుక్ర‌వారం ) 1000 మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలను మంత్రులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని, మ‌రో 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామని తెలియ‌జేశారు. ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని మంత్రి అన్నారు. సిఎం జగన్‌ పాలనాదక్షతకు ఈ టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమని అన్నారు. మంత్రి అనిల్‌‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. పేదలపై భారం పడకూడదనే ఉద్దేశంతో రూ.7వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని ఆయ‌న తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.