మిచౌంగ్ తుపాను.. రేపు స్కూళ్లకు సెలవు
నిజాంపట్నం (CLiC2NEWS): మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 11 ప్రమాద హెచ్చిరికలు ఉండగా..10వ నంబర్ హెచ్చరిక జారీ చేయడంతో తపాను తీవ్రత ఎంత ఉంటుందోనని భయాందోళనకు గురవుతున్నారు. హార్బర్వద్ద సముద్ద తీరంలో అలలు ఎగిసి పడుతుండటంతో మత్స్య కారులను సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో తుపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరాన్ని దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు తుపాను తీవ్రత దృష్ట్యా కృష్ణా జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.