హెచ్‌సీఏలో కీలక పరిణామం
అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌కు చుక్కెదురైంది. తదుపరి విచారణ వరకు అపెక్స్ కౌన్సిల్ ను అంబుడ్స్ మన్ రద్దు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ)లో వివాదం ముదురుతోంది. అజారుద్దీన్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. జాన్ మనోజ్‌ను తాత్కాలిక అద్యక్షుడిగా నియమించినట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది.
దీనిపై అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్‌నియామకం చెల్లదని అజారుద్దీన్ అన్నారు. కావాలనే తనపై అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఉన్న ఐదుగురిపై ఎసిబి కేసులు ఉన్నాయని.. వాల్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. విషయం ఏమైనా వుంటే కోర్టులో తేల్చుకోవాలని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే బుటకమని అజారుద్దీన్ అన్నారు.
ఐదు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు.. వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, కార్యదర్శి ఆర్ విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ. వారు గత కొంత కాలంగా అజారుద్దీన్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. జూన్ 10న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో అజరుద్దీన్‌ను సస్పెండ్ చేశారు.