విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హాదారిపై గ‌రుడ బ‌స్సు బోల్తా.. 11 మంద‌కి గాయాలు

జ‌గ్గ‌య్య‌పేట (CLiC2NEWS): విజ‌య‌వాడ నుండి హైద‌రాబాద్‌కు వెళ్తున్న ఎపిఎస్ ఆర్టీసీ బ‌స్సు చిల్ల‌క‌ల్లు టోల్ గేట్ స‌మీపంలో ప్ర‌మాదానికి గురైంది. బ‌స్సులో 27 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. విజ‌య‌వాడ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో 11 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సాంకేతిక లోపాల కార‌ణంగా బ‌స్సు ప్ర‌మాదానికి గురైన‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.