APSET 2021 నోటఫికేషన్ విడుదల
యూనివర్సిటి, డిగ్రీ కాలేజ్‌లలో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు
అమరావతి (CLiC2NEWS): ఎపి ప్రభుత్వం యూనివర్సిటి, డిగ్రీ కాలేజ్‌లలో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలను ఎపి స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (APSET-2021) ద్వారా ఆంధ్రయూనివర్సిటి నిర్వహిస్తుంది. ఈ పరీక్షను మొత్తం 30 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. UGC గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం / కాలేజ్ నుండి కనీసం 55శాతం మార్కలతో మాస్టర్ డిగ్రి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులు.
ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(నాన్ క్రిమీలేయర్)/పీడబ్ల్యూ డీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబరు 13,2021.
- పరీక్ష తేది: అక్టోబరు 31,2021.
- పరీక్ష నిర్వహించే కేంద్రాలు: విశాఖపట్నం,రాజమండ్రి,గుంటూరు,నెల్లూరు,అనంతపురం,తిరుపతి,కడప, కర్నూలు.
- పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apset.net.in/home.aspx