ఒక హిందువుగా కెసిఆర్‌కు పాదాభివందనం చేస్తున్నా.. హీరో సుమన్

యాదాద్రి (CLiC2NEWS) తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని సనీనటుడు సుమన్ అన్నారు. యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్టలో ఓ కార్యక్రమానికి సుమన్ హాజరయినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ హిందువులనే కాకుండా అన్ని మతాల వారిని ఆదుకుంటున్నారని, హిందువులకు ఆయన ఇచ్చిన బహుమతి యాదాద్రి ఆలయం అని అన్నారు. ఆలయాన్ని దేశంలోనే బెస్ట్‌గా తీర్చిదిద్దుతున్నారని భవిష్యత్తు తరతరాలు చూసి గర్వపడతాయని అన్నారు.
తెలంగాణ ప్రజలు తలెత్తుకుని బతుకుతున్నారంటే అద కెసిఆర్ వల్లే, రాజకీయాలలో తప్పొప్పులుంటాయి. కానీ, అంతకుముందు ఏంలేదు, ఇప్పుడు ఏం ఉన్నాయి, ఏం కావాలి? అనేది ఆలోచించాలి కానీ విమర్శలు తగదు.
తమిళనాడులో పుట్టిన నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరించారు అని సుమన్ అన్నారు.