దేశం వదిలి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ..!

కాబూల్ (CLiC2NEWS): ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌కు తాలిబన్లు చేరుకోవడంతో దేశం మొత్తం వారి హస్తగతమైంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయినట్లు అక్కడి TOLO న్యూస్ వెల్లడించింది. ఆయన తన కోర్ టీమ్‌తో కలిసి ఆఫ్ఘనిస్థాన్‌ను వీడినట్లు తెలిపింది. ఘనీ తజకిస్థాన్ వెళ్లినట్లు అక్కడి అంతర్గత మంత్రిత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం తజికిస్తాన్‌కు వెళ్లిన అష్రఫ్.. అక్కడ నుండి వేరే దేశానికి వెళ్లనున్నట్లు సమాచారం. అన్ని వైపుల నుంచి కాబుల్‌ను చుట్టుముట్టడంతో ఘనీ ప్రభుత్వం తప్పుకోవాల్సి వచ్చింది.
ఎలాంటి హింసకు పాల్పడొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అధ్యక్ష భవనానికి వెళ్లి చర్చలు జరిపారు. అధికారం శాంతియుతంగా బదిలీ చేస్తామని ఆఫ్ఘనిస్థాన్ మంత్రి కూడా వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా ప్రకటించారు. ఈ ప్రక్రియ శాంతియుతంగా ముగిసే వరకూ కాబూల్‌కు అన్ని ప్రవేశ మార్గాల వద్ద తాలిబన్ సైన్యం వేచి ఉంటుందని వెల్లడించారు.