గుండెపోటుతో ఎఎస్ ఐ మృతి

నిజామాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ ఒకటో పట్టణ ఠాణాలో ఎఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న దత్తాద్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన గత రెండేళ్లుగా నిజామాబాద్ లో ఒకటో పట్టణ ఠాణాలో సేవలందిస్తున్నారు. పట్టణంలోని గాయత్రి నగర్లోని తన నివాసంలో బుధవారం వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యలు ఆస్పత్రికి తరలింగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.