ఆత్మకూర్ (ఎస్) ఎస్సై సస్పెన్షన్

సూర్యాపేట (CLiC2NEWS): గిరిజన యువకుడిని విచారణ పేరుతో చితకబాదిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) ఎస్సై లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీతండాకు చెందిన వీరశేఖర్‌ను విచారణ పేరుతో ఎస్సై చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి బంధువులు, గ్రామస్థులు గురువారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ఎస్సైని సస్పెండ్ చేసినట్లు సూర్యాపేట ఎస్పీ తెలిపారు.