ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి..
మెదక్ (CLiC2NEWS): ప్రేమించడం లేదని యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. బెంగళూరు చెందిన యువకుడు చేతన్ అలియాస్ కిరణ్ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితురాలు ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు కళాశాలకు వచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.