ఖమ్మం: వరల్డ్ హార్ట్‌డే సందర్భంగా గాంధీ గంజ్ స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

ఖమ్మం (CLiC2NEWS): వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి, అ వి రాకుండా ఉండడానికి పాటించవలసిన ఆహార నియమాలు గురించి విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. యోగాచార్యులు షేక్ బహర్ అలీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని గాంధీ గంజ్, క్రియేటివ్ హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు వివరించడం జరిగింది. సరైన ఆహారం, ఒత్తిడి నిర్వహణపై ఆచరణాత్మక చిట్కాలను అందించారు. యోగ ప్రాణాయామం ద్వారా ఆరోగ్యకరమైన హృదయాన్ని కాపాడుకోవచ్చునని.. దీర్ఘకాలిక శ్రేయస్సు కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి యొక్క ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులందరూ శ్రద్ధాసక్తులతో కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రియేటివ్ హైస్కూల్ గాంధీ గంజ్ ఖమ్మం లో అక్టోబర్ 2నుండి ప్రతిరోజు సాయంత్రం 05;00 నిమి.ల నుండి 06:30 నిమి ల వరకు ఉచితంగా యోగ ఆయుర్వేద శిక్షణ తరగతులు నిర్వహించబడును.