యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం

లక్షేట్టిపేట (CLiC2NEWS): AHTU ఆధ్వర్యంలో మంచిర్యాల  టాస్క్ ఇన్‌స్పెక్ట‌ర్ అశోక్, ఎస్ ఐ ల‌చ్చన్న
లక్షేట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో బాల్య వివాహాలు,బాల కార్మికులు,పొక్సో యాక్ట్,సైబర్ క్రైమ్స్, గృహ హింస,మాదక ద్రవ్యాల వినియోగం మరియు తదితర అంశాలపై సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాలోని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థుల కు అవగాహన కల్పించడం జరిగింది.

ముఖ్యంగా మహిళలపై చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఐ అశోక్ గారు అన్నారు. యుక్తవయసులో ఉన్న తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను తల్లీదండ్రులు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఉండాలని సూచించారు. బాల్యవివాహలకు ప్రోత్సహించే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు మాదకద్రవ్యాల బారిన పడకుండా మంచిగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆపదలో ఉన్నవారు 108,100,1098,112 నంబర్లకు ఫోన్ చేసి పోలీసు మరియు ఇతర శాఖల యంత్రాంగం యొక్క సేవలు పొందాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.