మంచిర్యాల జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు..

మంచిర్యాల (CLiC2NEWS): మత్తు పదార్థాతో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మల్యే బాల్క సుమన్ సూచించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియేజక వర్గం సింగరేణి ఫంక్షన్ హాల్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా విప్ బాల్కసుమన్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడవాలని విజ్ఞప్తి చేశారు.
మత్తు పదార్థాల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మత్తు పదార్థాలు విక్రయించేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేవారు. జిల్లాలోని కళాశాలలు, రైల్వే స్టేషన్లు, గ్రామాలలో రెక్కీ నిర్వహించాలని తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని జరగాలని, పోలీసు శాఖకు ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యాక్రమం నిర్వహించిన పోలీసు శాఖ వారికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎసిపి ఎడ్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.