అయోధ్య బాలరాముడిని తాకిన సూర్యకిరణాలు

ఆయోధ్య (CLiC2NEWS): ఆయోధ్య రామాలయంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై తిలకం వలే స్యూర్యకిరణాలు ఆవిష్కృతమైన తీరుకు భక్తజనం పరవశించిపోయారు. స్వామివారి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్లులు పోటెత్తారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదిటిపై ఈ సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణం చేశారు. దీనికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తులు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సిబిఆర్ ఐ) శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.
రామ మందిరంలో బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేటట్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడో అంతస్తు నుండి గర్భగుడిలోకి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ప్రతి శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించేలా శాస్త్రవేత్తలు ప్రత్యేక నిర్మాణం చేశారు. వాతావరణంలో మార్పులు.. గ్రహాల పరిభ్రమణం, గడియారంలో ముల్లులు తిరగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం .. గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం.. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. దీనికి ముందు ప్రతి ఏటా శ్రీరామనవమి వచ్చే కాలన్ని సెకన్లతో సహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లుగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాల్సి ఉంటుందని సమాచారం.