బద్రీనాథ్ రోడ్డు మూసివేత..
డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవటంతో కొండచరియలు విరిగిపడి బద్రీనాథ్ హైవేపై బండరాళ్లు నిలిచాయి. దీంతో ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేసినట్టు, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రోడ్డు మూతపడటంతో యాత్రకు ఆటంకం కలుగుతున్నది. పలు ప్రాంతాల్లో భక్తులు చిక్కుకుపోయినట్లు సమాచారం. బద్రీనాథ్ – కేదార్‌నాథ్ ఆలయ కమిటి ప్రకారం మే 8వ తేదీన బద్రీనాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ సంవత్సరం 7.60 లక్షల మంది పర్యాటకులు బద్రీనాథ్‌ను సందర్శించారు.