రంజాన్ “సాహెరి “ఎంతో శుభం

అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో రమజాన్ మాసంలో తెల్లవారుజామున సాహెరి తినటంలో ఎంతో శుభం వుంది.
హాజ్రత్ అనస్ (రజి ) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సఆసం ) ఇలా ఉపదేశించినారు. “సాహెరి “తినండి. సాహెరి తినటంలో శుభం వుంది. (ముత్తపకున్ అలైహ్ “)

ఇస్లామియా ఆరాధనలలో శుభాలు, లాభాలు కూడా వున్నాయి.
ఆ సైద్దాంతిక ఏమిటంటే దైవప్రసన్నత కోసం, ఆత్మ వికాసం కోసం మనిషి తన శరీరాన్ని బాధలకు గురించేయటం. దానిని శుష్కింపచేయటం అవసరమనే భావన ఇతర మతాల్లో వుంది. ఉదాహరణకు వస్తువులతో చావడం, దైవప్రసన్నతకు మార్గమని, దీని ద్వారా దైవాన్ని చేరుకోవచ్చని కొన్ని మతాలు భావిస్తాయి. ఈ విశ్వాసం కారణంగా వారు ఇలాంటివే మరి కొన్ని పనులు కూడా చేస్తారు. ఉదాహరణకు ఒకరు బావిలో తలక్రిందులుగా వ్రేలాడితే మరొకరు భట్టిల్లో మలమల మాడుతుంటారు. మరి కొందరు దేశదిమ్మరులుగా జీవిస్తుంటారు. మరికొందరు అయితే రకరకాల జంతువులు, కీటకాలు, ద్వారా తమ శరీరాన్ని చిత్రహింసలకు గురిచేసుకుంటారు. ఈ విధంగా తమకు తాము చిత్ర హింసలకు గురించి చేసుకుంటూ దైవప్రసన్నత బడయటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇస్లామియా ఆరాధనా విశ్వాసల్లో ఇవన్నీ మూఢనమ్మకాలు, అజ్ఞానం తప్ప మరేమికాదు.

సాహెరి తినటంలో అసలు వున్న శుభం ఏమిటి?
ఈ హదిసులో దైవప్రవక్త (సఆసం ) సాహెరి తినండి. సాహెరి తినటంలో శుభం వుంది. అన్నారు. దీనిలో వున్న శుభం ఏమిటంటే ? సూర్యోదయానికి పూర్వం, నుండి సూర్యాస్తమయం వరకు రోజా పాటించమని అయన ఆదేశం. ఈ ఆదేశపాలనలో “సాహెరి ” మీకు సహాయకారి అవుతుంది. రోజా ప్రారంభానికి ముందు దైవం మికిచ్చిన అనుమతిని వినియోగించుకొని భోజనం చేసి, నీళ్లు త్రాగితే ఇక ఆ రోజల్లా అది మీకు పనికి వస్తుంది. కానీ మీరలా చేయకపోతే తప్పకుండా మీరు నీరసం వస్తుంది. ఇలా నీరసపడిపోతే మీరు దైవాదేశాలను పాటించటంలో విఫలం అవుతారు. ఎందుకంటే దైవం మిమ్మల్ని నెల రోజులు రోజాలు పాటించమన్నాడు. ఒకవేళ మీరిలోపులనే నీరసపడి అన్నీ రోజాలు పాటించకపోతే..? దైవాదేశపాలనలో మీరు తప్పక విఫలం అవుతారు.
అందుకే దైవప్రవక్త (సఆసం ) తప్పకుండా సాహెరి భుజీంచమన్నారు. తినటానికి అనుమతి ఉన్న సమయంలో తింటే, తినడానికి అనుమతిలేని సమయంలో దైవాదేశాలను పాలించటానికి మీకు శక్తి లభిస్తుంది. రంజాన్ రోజా చాలా పరిపూర్ణణమైనది.రంజాన్ మాసంలో రోజా చాలా పవిత్రమైనది. మిగతాది వచ్చే సంచికలో..

–షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.