Kammam: యోగ, విటమిన్ల లోపం గురించి అవగాహన కార్యక్రమం
ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మంలోని క్రియేటివ్ గ్రామర్ స్కూల్లో కమలాకర రావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు శారీరక, మానసిక ఒత్తిడి నుండి విముక్తి కొరకు యోగ మరియు ప్రాణాయామం,మరియు విటమిన్ B12. విటమిన్ D లోపం నుండి అధిగమించటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యాక్రమం నిర్వహించడం జరిగింది.
యోగాచార్యుడు. షేక్. బహార్ అలీ ఆహారం, మరియు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీపడకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు గురించి వివరించారు. డెంగ్యూ, కరోనా వైరస్ జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, ప్రకృతి వైద్యం గురించి చెప్పటం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం కౌశిక్, ప్రిన్సిపాల్, టీచర్స్, స్టాఫ్ పాల్గొన్నారు.