ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్
హైదరాబాద్ (CLiC2NEWS): రైల్వే ఆస్తులను అమ్మినట్లు ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ చైర్మన్‌గా ఆయన ఇవాళ (సోమవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈకార్యక్రమానికి మంత్రులు కెటిఆర్, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేశ్ గుప్తా తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

