మరోసారి రికార్డు ధర : రూ.18.9 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

హైదరాబాద్ (CLiC2NEWS): భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష 30 వేలు అధికంగా రూ.18 లక్షల 90 వేలు పలికింది. వేలం పాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలిసి బాలాపూర్ గణేశుని లడ్డూని దక్కించుకున్నారు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది.
లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణరావు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నట్లు లడ్డూ దక్కించుకున్న వారిలో ఒకరైన ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్నారు. శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నానని చెప్పారు.
1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా వ్యాప్తి వల్ల జరగలేదు. ఈయేడు రెట్టింపు ఉత్సాహంతో వేలంపాటలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపారు. బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 2019లో రూ.17.60 లక్షలకు ఈయన లడ్డూను దక్కించుకున్నారు. ఆ నగదును ఉత్సవ సమితి రాంరెడ్డికి అందించింది. వేలంపాటలో స్థానికులైతే డబ్బును మరుసటి ఏడాది చెల్లిస్తారు. స్థానికేతరులకు మాత్రం అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి.
ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలంపాటకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.
1994 నుండి లడ్డూ వేలం వివరాలు..
- 1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
- 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
- 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
- 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
- 1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
- 1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
- 2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
- 2001 జీ రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
- 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
- 2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
- 2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
- 2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
- 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
- 2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
- 2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
- 2009లో సరిత- రూ.5,10,000
- 2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
- 2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
- 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
- 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
- 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
- 2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
- 2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
- 2017లో రూ.15 లక్షలు పలికిన లడ్డూ వేలం
- 2018లో శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
- 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
Wow, marvelous blog format! How lengthy have you been running a blog for? you make running a blog look easy. The overall look of your site is great, let alone the content!!