Bank Holidays: మే నెలలో 12 సెలవులు?

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఏప్రిల్ నెల మాదిరిగా మే నెలలో కూడా సెలవులు చాలా ఉన్నాయి. మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి.
మే నెలలో వచ్చే సెలవులు..
- మే 1 మహారాష్ట్ర దినోత్సవం / మేడే.
- మే 2.. ఆదివారం యధావిధిగా బ్యాంకులకు సెలవుదినం.
- మే 7 వ తేదీన జమాతుల్ విదా సందర్భంగా బ్యాంకులకు సెలవు.
- మే 8 రెండో శనివారం సెలవు
- మే 9 ఆదివారం సెలవు.
- మే 13 న ఈదుల్ ఫితర్ సెలవు
- మే 14 న రంజాన్, పరుశురామ్ జయంతి
- మే 16 ఆదివారం సెలవు
- మే 22 నాలుగో శనివారం సెలవు
- మే 23 ఆదివారం సెలవు
- మే 26 బుద్ధపూర్ణిమ సెలవు
- మే 30 ఆదివారం సెలవులు ఉండనున్నాయి.
అయితే.. కొన్ని రాష్ట్రాలకు ప్రాంతీయ పండుగలకు అనుగుణంగా సెలవులు ఉంటాయి. మిగతా రాష్ట్రాలకు ఉండవు.
కాగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా బ్యాంకులు 4 గంటలు మాత్రమే తెరుచుకోనున్నాయి. భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సూచించింది.
ఇప్పుడు బ్యాంకులు సాధారణ ప్రజలకు 4 గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకింగ్ కమిటీలను ఐబీఏ ఆదేశించింది.