Alair: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/man.jpg)
ఆలేరు (CLiC2NEWS): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ అని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు. ఆలేరులో బుధవారం క్లిక్2న్యూస్‌తో మాట్లాడుతూ.. ఆడపడుచులందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపుప్వు బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి మంజుల పత్తిపాటి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ అని.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారని పేర్కొన్నారు.