కొవిడ్-19 వ్యాప్తి నివారణపై అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ

మంచిర్యాల (CLiC2NEWS): కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ అన్నారు. జిల్లాలోని సి.సి.సి. నస్పూర్లో గల సింగరేణి అతిథి గృహంలో సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. జి. శ్రీనివాస్ రావు, వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి, రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎం.డి. చంద్రశేఖర్రెడ్డి, ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి. డా॥ గంగాధర్, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరితో కలిసి వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ కొవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలనికోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నమోదైన పాజిటివ్ కొవిడ్-19 కేసులు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారు, వైరస్ వ్యాప్తికి కారణాలు, నియంత్రణ, చికిత్స అందిస్తున్న వారి వివరాలపై నివేదిక అందించాలని తెలిపారు.

గ్రామాల నుండి వచ్చిన కొవిడ్ కేసులు, వ్యాప్తికి గల కారణాలపై విస్తృతంగా విశ్లేషణ, పరిశోధన చేయాలని, వైరస్ ప్రబలే ప్రాంతాలలో నిఘా ఉంచి పర్యవేక్షించాలని అన్నారు.

టెస్ట్ కిట్లకు, వ్యాక్సిన్లు కొరత లేదని, వర్షాకాలం సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు వస్తాయని తెలిపారు. , జ్వర సర్వే నిర్వహించాలని, జ్వర సర్వే ద్వారా కొవిడ్ లక్షణాలు, జ్వర పీడితుల వివరాలు తెలుసుకొని తెలుసుకుని ముందుగా మందుల ద్వారా చికిత్స అందించవచ్చని అన్నారు.

అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రుల సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యాధికారులు, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాలతో పాటు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరిగిందనితెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు, ఉప వైద్యాధికారి డా॥ ఫయాజ్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా॥ అరవింద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

situs gacor

Leave A Reply

Your email address will not be published.