TS: బీరు ధ‌ర త‌గ్గింపు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం బీరు ధ‌ర త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అన్ని ర‌కాల బీరు బ్రాండ్ల‌పై రూ. 10 త‌గ్గిస్తూ అబ్కారీ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తంలో ప్ర్య‌తేక ఎక్సైజ్ సెస్ పేరుతో సీసాపై రూ. 30 ప‌న్ను విధించేది. దీని నుంచి రూ. 10 త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌గ్గించిన ధ‌ర‌లు నేటి అర్ధ‌రాత్రి నుంచే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఎక్సైజ్ శాఖ వెల్ల‌డించింది. కాగా మ‌ద్యం దుకాణాల్లోని పాత స్టాక్‌కు ఇది వ‌ర్తించ‌దు.

Leave A Reply

Your email address will not be published.