ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కుంబ్లే
అమరావతి (CLiC2NEWS): టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కుంబ్లే.. సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, దీనికి తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపారు.
క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాల నుంచే అన్ని రకాల క్రీడా సామాగ్రి తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో ఉంటుందని మాజీ కెప్టెన్ వివరించారు. దీనికి సంబంధించిన సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిఎం చెప్పారు.