అధిక వ‌డ్డీ ఇస్తామ‌ని న‌మ్మించి రూ. 170 కోట్లు వ‌సూలు..

క‌డ‌ప (CLiC2NEWS): ఎక్కువ మొత్తంలో వ‌డ్డీ ఆశ చూపి.. ఒక‌టి రెండూ కాదు ఏకంగా రూ. 170 కోట్లు వ‌సూలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. 9 ఎఫ్ ఎక్స్ గ్లోబ‌ల్ ట్రేడింగ్ కంపెనీ కార్యాల‌యాల‌ను తిరుప‌తి, క‌డ‌ప‌, రాయ‌చోటి ప్రాంతాలో ఏర్పాటు చేసి 302 మందిని ఏజెంటులుగా నియ‌మించుకున్నారు. వీరంతా మొత్తం 1,759 మంది నుండి రూ. 170 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు సమాచారం. కమిష‌న్ రూపంలో ఏజెంట్లకు రూ. 65 కోట్లు కంపెనీ చెల్లించిన‌ట్లు రికార్డుల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో కంపెనీ బోర్డు తిప్పేసింది. న‌గ‌దు డిపాజిట్ చేసిన వారిలో పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.