Mancherial: డిల్లీ వర్సిటీలో సీటు సాధించిన బెల్లంపల్లి సిఒఇ విద్యార్ధులు
బెల్లంపల్లి (CLiC2NEWS): తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ( సిఒఇ) విద్యార్ధులు ఉన్నత చదువులకై నిర్వహించే పలు రకాల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో డిల్లీ వర్సిటీ లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.
శుక్రవారం డిల్లీ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ విద్యార్ధులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏకంగా ముగ్గురు ఎంపికై బెల్లంపల్లి సత్తా చాటిన విద్యార్ధులను ప్రిన్సిపాల్, అహ్ద్యాపకులు అభినందించారు. గుడి సుశందర్ రెడ్డి హిందూ కాలేజి లో బిఏ (ఆనర్స్) ఫిలాసఫీ,జంగం నాం దేవ్ ద్యాల్ సింగ్ కాలేజిలో బియస్సీ( ఆనర్స్) కంప్యూటర్ సైన్స్, మీసాల రాజసాగర్ ఆచార్య నరేంద్రదేవ్ కాలేజి లో బియస్సీ( ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ కోర్సులకు గాను అడ్మీషన్స్ పొందారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన డిల్లీ యూనివర్సిటీ పరిదిలోని కలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తమ విద్యార్ధులు ముగ్గురు ఎంపిక కావడంపట్ల ప్రిన్సిపాల ఐనాల సైదులు సంతోషం వ్యక్తంచేశారు.

ఈ సందర్బంగా ఆదిలాబాద్ సంక్షేమ గురుకులాల ప్రాంతీయాధికారి(ఆర్సీఓ) కొప్పుల స్వరూపరాణి, ఏఆర్సీఓ కోటిచింతల మహేశ్వర రావులు విద్యార్ధులను , అధ్యాపక బ్రుందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్, అధ్యాపకులు శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీనారాయణ, అశోక్, కట్లరవీందర్,అనిరుద్, గాజుల రాజేందర్,చిలివేరు సాగర్,ఆకెనేపల్లిరాజేష్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.