వెదురు చెట్టుతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు..

సంస్కృతంలో వంశ హిందీలోని బాంసా తెలుగులోని వెదురు అని అంటారు.

భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పెంచుతున్నారు అంతేకాకుండా ఈ అడవుల్లో కూడా వచ్చగా చక్కగా పెరిగి ఎత్తుగా ఏపుగా పచ్చగా కనబడతా ఉంటాయి. వీటిని చూడంగానే మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది. ఇది వాస్తు ప్రకారము ఇండ్ల వద్ద కూడా చక్కగా పెంచుకోవచ్చును.

వెదురు సుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరిగి బహువార్షిక పొద అయిన వెదురు కాండం దృఢంగా పసుపుపచ్చని కేశాలతో కప్పబడి ఉంటుంది. ఆకులు బల్లెం ఆకారంలో ఉంటాయి..

వెదురు పుష్పించి గింజలు తయారైన తర్వాత వెదురు పొద ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత చక్కగా దాని ఆకులు రాలిపోతా ఉంటాయి. వెదరు ఖాళీ కణుపుల స్థలములలో తెల్లని మెత్తటి గడ్డి లాంటిది తయారవుతుంది. దీనినే వెదురు ఉప్పు లేదా వంశలోచనం అంటారు

ఇది చక్కని ఔషధ గుణాలు కలిగి ఉంటుంది దీనిని గిరిజనులు ఆహారంగా సేవిస్తారు. వెదురు లేత మొలకలను ఉడకబెట్టి పసుపు ఉప్పు కారం కలిపి ప్రసవించిన స్త్రీలకు ఇచ్చిన వాతం హరిస్తుంది.

వెదురు మధుర కషాయరసము శీత వీర్యము లఘు రూక్ష గుణాలు మరియు మధుర విపాకములను కలిగి ఉంటుంది.

వెదురు చర్మవ్యాధులు మూత్ర కచ్చము మరియు వాపు అనే జబ్బులకు ఉపయోగిస్తారు వెదురుతో ఇల్లు నిర్మించుకుంటారు చక్కని వేణువులు లేదా పిల్లని గ్రోవిలను కూడా చక్కగా వెదురుతో తయారు చేస్తారు.

ఈ మధ్యకాలంలో ప్రకృతిని ప్రేమించే ప్రేమికుల ఎక్కువ అవ్వటం వలన వెదురు బొంగులతోనే చక్కగా కుర్చీలను సోఫా సెట్లను, టీ పాయిస్ ని, తయారుచేసుకొని చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వీటి వలన ఇంట్లో కూడా చక్కని వాతావరణం ఏర్పడుతుంది. వెదురులో కార్పొ హైడ్రేట్లు

ప్రోటీన్లు

ఇనుము
నియాసిన్
ఫోస్పోరస్
క్రొవ్వు

విటమిన్ ఏ
కొద్ది మోతాదుల్లో ఉన్నాయి వెదురు ఆకుల యందు హైడ్రోసైనిక్ యాసిడ్, బెంజోయిక్ ఆసిడ్స్ ఎక్కువ శాతం లో ఉన్నాయి. లేత వెదురు ఆకులలో డియామిడేజ్, న్యూక్లియెజ్, ప్రోటియో లైటిక్ ఉన్నాయి.

దీని ఆకుల రసమునందు ప్రోటీయోజ్ మరియు ఫెరాక్సిడెజ్ గుణములు వున్నాయి.
దగ్గు మూత్రం కష్టంగా వచ్చినప్పుడు వెదురు లేత కొమ్మలను ముక్కలుగా చేసి చక్కని కషాయం కాచి సేవించిన దగ్గు మరియు మూత్రం కష్టంగా వెళ్లడం అనే లక్షణాలు తరిమివేస్తాయి.

వెదురు లేత ఆకులను కూరగా చేసుకుని తింటారు.వెదురు ఆకులతో కాషాయం కాచి తాగిన అర్ష మొలలు రోగులు, వ్యాధి లక్షణాలు శమిస్తాయి.

వెదురు వేళ్ళను పాలతో నూరి త్రాగిన పిచ్చికుక్క కాటు వల్ల కలిగిన విషమును హరిస్తుంది.

లేత వేదురును కత్తితో గిచివచ్చిన ఆకు పచ్చని చూర్ణాన్ని గాయాలపై రాసిన గాయాలు తగ్గిపోతాయి.

-షేక్. బహార్ అలీ
 ఆయుర్వేద వైద్యుడు


Leave A Reply

Your email address will not be published.