పుచ్చ‌కాయ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు

హిందీలో తర్భుజా

తెలుగులో పుచ్చపండు

సంస్కృతంలో కాలింగ

ఇంగ్లీషులో వాటర్ మీలాన్

లాటిన్ సిట్రల్లస్ వల్గరీ్స్

కుటుంబం కేకర్బీటాసె

పుచ్చకాయ గుండ్రంగా కోలగా పైన ఆకుపచ్చ లేదా తెల్లటి మచ్చలు కలిగి ఉండే పండు పుచ్చపండు. వేసవికాలంలో వీటిని తింటూ బాగా ఎంజాయ్ చేయవచ్చును. దీనిలో గుజ్జు ఎర్రగా లేదా లేత గులాబీ రంగులో ఉంటుంది. గింజలు నల్లగా, ఎర్రగా లేక తెల్లగా ఉంటాయి. పుచ్చపండు చాలా రుచిగా, మధురంగా, చల్లగా ఉంటుంది. వేసవి యందు దీనిని తింటే దప్పిక తీరుతుంది.

చాలా చక్కగా ఎండిపోయిన గొంతులో ఒకేసారి నీరు వచ్చినట్లు వచ్చి గొంతు చల్లగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది.

పుచ్చకాయలో పోషక విలువలు.

  • విటమిన్ A
  • విటమిన్ B
  • విటమిన్ B 2
  • తేమ
  • ప్రోటీన్లు
  • కాల్షియం
  • ఫోస్పరస్
  • ఆస్కార్బీక్ ఆసిడ్
  • నియాసిన్
  • మెగ్నీసియం
  • క్లోరిన్
  • కాపర్
  • కెలరీలు ఉంటాయి.

పుచ్చపండు తింటే వేసవిలో వచ్చే విరోచనాలు తగ్గిస్తుంది. డి హైడ్రేటేషన్ తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువగా ఏంజైమ్స్ యూరేజ్ కలదు. దీని జ్యూస్ లో సిట్రూల్లిన్ ఉంటుంది. మరియు మానిటాలు కలవు. ఇందులో పెక్టిన్ ఎక్కువ శాతంలో కలదు. నీరు కూడా ఎక్కవ శాతం ఉంటుంది. పుచ్చ‌పండు తింటే శరీరంలో వున్న వేడి మూత్ర రూపంలో చక్కగా బయటికి వస్తుంది.

నీరసం తగ్గిస్తుంది. నిస్సతుగా వున్న, చమట బాగా రావటం వాటిని తగ్గిస్తుంది.

కిడ్నీలో రాళ్లు, గాల్ స్టోన్స్ మరియు మాధమేహం నందు వచ్చే కిటో ఎపిడోసిస్ నందు వాడవచ్చును.

శోష, వడ దెబ్బలను తగ్గిస్తుంది. దీనిని సేవించటం వలన శరీరం తేలిక ఉంటుంది.

పుచ్చపండు జ్యూస్ హైపర్ టెన్షన్, గుండె జబ్బులు వున్నవారికి చాలా మంచి ఔషాదం లాగా ఉపయోగపడుతుంది. శరీరంలో సోడియం ని బయటకు పంపుతుంది.

రంజాన్ మాసంలో ఉపవాసం వున్నవారికి అద్భుతంగా పుచ్చపండు జ్యూస్ పనిచేస్తుంది. పుచ్చపండు జ్యూస్ నందు గుల్కొజ్ మరియు నిమ్మరసం కలిపి ఇచ్చిన తక్షణమే శక్తినిస్తుంది. బలాన్నిస్తుంది. కలరా, గ్యాస్ట్రో ఏంటరైటిస్, అతిసారం, జిగురువిరోచనాలు, రోగులకు చక్కని ఉపశమనం కలుగుతుంది.

పుచ్చపండు గింజలను మెత్తగా నూరి రసం తీసి త్రాగిన అధికరక్తపోటు, మూత్రంలో మంట, మూత్రం కష్టంగా బయటికిపోవటం, క్షయవ్యాధి, గనేరియా, రోగులకు చాలా ఉపయోగకరం.

పుచ్చపండు తింటే శుష్కించిన శరీరం కలవారికి, ఉష్ణతత్వం కలవారికి సమస్థితి కలుగుతుంది.

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు
సెల్‌: 73961 26557

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: గుమ్మడికాయలో దాగిఉన్న‌ అద్భుత‌మైన ఆరోగ్య ర‌హ‌స్యాలు..

Leave A Reply

Your email address will not be published.