పాలమూరు కవులకు ఉత్తమ సాహితీవేత్త, భాషా సేవారత్న పురస్కారాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా కవులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న శాంతా వసంత చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాలకు పాలమూరు కవులు ఎంపికయ్యారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి ఉత్తమ సాహితీవెత్త, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాలు దక్కాయి. శాంతా బయోటెక్స్ అధినేత వరప్రసాద్ రెడ్డి ఈ పురస్కారాలను ఈ నెల 18 వతేదీన హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో అందజేస్తారు. .