పేద‌ల‌కు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించాలి: మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎంఎన్ ఆర్ అసుప‌త్రిని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద‌లకు మెరుగైన వైద్య సేవ‌లు అందించే ల‌క్ష్యంగా వైద్యులు ప‌నిచేయ‌ల‌న్నారు. క‌రీంగ‌న‌ర్ వైద్య‌రంగంలో ముందుకెళ్లింద‌ని.. ఇదివ‌ర‌కు గుండె, కిడ్నీ వంటి స‌మ‌స్య‌ల‌కు హైద‌రాబాద్‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. ప్ర‌స్తుతం క‌రీంన‌గ‌ర్‌లోనే అన్ని ర‌కాల స‌దుపాయాల‌తో సూప‌ర్ స్పెషాలిటి ఆస్ప‌త్రులు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ఇక్క‌డ ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల సైతం వ‌చ్చే సంవ‌త్స‌రం నుండి అందుబాలోకి వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.