సీతారాముల కళ్యాణ తలంబ్రాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): శ్రీరామనవి సందర్భంగా భద్రాచల సీతారాముల కల్యాణ తలంబ్రాలను రూ. 151 చెల్లించి హోం డెలివరీ పొందవచ్చు. గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు తెలంగాణ అర్‌టిసి సిద్ధమైంది. దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యక్రమానకి శ్రీకారం చుట్టింది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టిఎస్ ఆర్‌టిసి లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని టిఎస్ ఆర్‌టిసి లాజిస్టిక్ కౌంటర్‌లో తలంబ్రాలను బుక్ చేసుకొనే సదుపాయం అందుబాటులో ఉంది. టిఎస్ ఆర్‌టిసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారు. 040-23450033, 040-69440000, 040-69440069 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు.