ఆరేళ్లుగా సహజీవనం.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రాగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వీరభద్రం.. మణుగూరు మండలం తోగ్గూడేనికి చెందిన స్వాతితో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మాచినేని పేట తండాలోనే భద్రం భార్యతోపాటు స్వాతి కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా భద్రం, స్వాతిల మధ్యం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 9వ తేదీన ఇంట్లోనే స్వాతిని హత్యచేసి, సమీపంలో ఉన్న పత్తి పొలంలో పాతిపెట్టాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.