సీతారాముల కళ్యాణ తలంబ్రాలు మీ ఇంటికే..

హైదరాబాద్ (CLiC2NEWS): భద్రాద్రి ఈ నెల 6వ తేదీన శ్రీరామ నవవి సందర్భంగా ప్రతి రామాలయంలోను శ్రీ సీతారామ చంద్రమూర్తి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు తరలి వెళతారు. కల్యాణానికి వెళ్లలేని భక్తులు రాముల వారి తలంబ్రాలు కావాలంటే మన ఇంటికే తెప్పించేకోవచ్చు. దీనికోసం తెలంగాణ ఆర్‌టిసి గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా తలంబ్రాలన భక్తుల ఇళ్ల వద్దకు చేరవేయనుంది. దేవాదాయ శాఖ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులు టిఎస్ ఆర్‌టిసి లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151చెల్లించి వివారాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాములవారి కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇళ్లకు డెలివరీ చేయనున్నారు.
స్వామి వారి తలంబ్రాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునే భక్తులు ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు 040-69440069, 040-69440000 కాల్ సెంటర్‌లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లు స్వీకరిస్తారని టిజిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.